తెలుగు బ్లాగరులారా! నమస్కారం.
చాలా మంది తెలుగు బ్లాగరులను చూసి, నేను కూడా నాకు నచ్చినవీ, నచ్చనివీ, ఒకటేమిటి, అన్నీ ఒక చోట తెలుగులో రాద్దామని, ఈ బ్లాగును మొదలుపెడుతున్నా. అక్కడికి నేనేదో కవితలూ గట్రా రాసేద్దామని కాదు. అలాంటివి రాకపోయినా, ఇంకొకళ్ళు రాసిన వాటి మీద కామెంట్రీలు లాంటివి స్వతహాగా చేతనవ్వడం, వ్రాయటం మర్చిపోయిన తెలుగులో గుర్తున్నది రాసుకోవడం, ఈ బ్లాగు మొదలెట్టడానికిగల కారణాలు.
అంతే కాదండొయ్! “ప్రతి మనిషికీ తన గురించే కాకుండా, తన అభిప్రాయాలను గురించి అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అది సహజం.” కాబట్టి, నేను రాసే విషయాల గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ఈ బ్లాగు యొక్క అతి ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి, మీ అభిప్రాయాలను, కొట్టొచ్చినట్టు తెలుపవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన WordPress వారికీ, lekhini.org వారికీ కృతఙ్ఞతలు తెలుపుకుంటూ,
రవి హర్ష
modati blogeee rachchalu mamaaa kummey nee venaka nenunna annavisham marchipoku……..
అప్పుడే ఏమైంది మామా! చించేద్దామంతే
కూడలి.ఆర్గ్ లో మీ బ్లాగుని నమోదు చేసుకోండి (ఇప్పటికే చేసుకోకపోయినట్లయితే). All the best.
తప్పకుండా! Thanks