నమస్కారం!
బ్లాగు నామకరణ టపాను చదవడానికి విచ్చేసినవారందరికీ పేరు పేరునా స్వాగతం. పెద్ద పెద్ద కవులకు, రచయితలకు, కలం పేరు లాగా, చిన్న బ్లాగరినైన నాలాంటి వాళ్ళు కూడా కీబోర్డు పేరు లాంటివి వాడటం బావుంటుందని ఈ నామకరణ మహోత్సవాన్ని సంకల్పించాను.
సంకల్పం. అస్సలు కష్టం లేని పని. త్వరగానే అయిపోయింది. కానీ, ఏం పేరు పెట్టాలో చాలా తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. మొదటగా, గుఱ్ఱం జాషువా గారి గిజిగాడు గుర్తుకు వచ్చింది. అంతటి నైపుణ్యం ఉన్న గిజిగాడితో నాకు పోలికా…? అమ్మో, ఆ పేరుకు తగ్గట్టుగా నా బ్లాగును తీర్చిదిద్దాలంటే, చాలా కష్టం. అంత శ్రమ నా వల్ల కాదని, మరో కోణంలో ఆలోచించడం మొదలు పెట్టాను.
మరో కోణం. నాకు అట్లాంటి గొప్ప పేర్లు సరిపోవని నిర్ణయించాక, హాస్యప్రధానంగా వుండాలని, ఆ కోణంలో ఆలోచించాను. బంకు శీను, గాలి శీను, బొట్టు శీను… ఛీ ఛీ.. ఒక పేరన్నాక దానికి ఒక మంచి కారణం ఉండాలి కానీ మరీ ఇలా గాలి పేర్లొద్దు.
సరే, ఇలా కుదరదు అని అనుకుంటుండగా, హాస్యంలో పౌరాణికాలను కూడా వాడుకుంటూ హాస్యాన్ని అత్యద్భుతంగా పండిస్తూనే జనం మరచిపోతున్న కథలను గుర్తు చేసిన జంధ్యాలగారు గుర్తుకు వచ్చారు. ఆయన సినిమాల్లో కొన్ని తిట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉదాహరణకి, “లారీ టైరుకి నోటితో గాలి ఊదేవాడి మొహమూ నువ్వూను”, “నువ్వు టీవీ మహభారతంలో దుర్యోధనుని 93వ తమ్ముడిలాంటి వాడివి రా, నీ ఫేస్ కూడా జనానికి తెలీదు” లాంటివన్నమాట. అబ్బ. ఎంత బావుందో కదా! దుర్యొధనుని 93వ తమ్ముడు. అద్గది. ఈ పేరేదో బావుంది. కాని, “హింసించే రాజు, 23వ పులకేశి” లాగా, ఎన్ని రోజులని 93వ తమ్ముడిని అని చెప్పుకోవాలి? ఇలా కాదు. ఆ పేరేదో కనుక్కోవాలి. మహాభారతం ఈ-బుక్ డౌన్లోడ్ చేశాను. ఎన్ని రోజులు చదవాలో అనుకుంటుండగా. నా మిత్రుడు, ఇలాంటి వాటికి మన Wiki ఉందని గుర్తు చేశాడు. అద్ది. అప్పుడు దొరికిందండీ పేరు. ప్రమతి. పేరు బానేవుంది. మరీ దుశ్శాసనుడు, దుర్ముఖుడు అని కాకుండా.
ఇదండీ. ఈ రోజు టపా. ఆయాసం వచ్చేంతటి ఈ ప్రయాస, ఈ పేరు ఎలా ఉన్నాయి?
ప్రమతి
As per my knowledge, all the 100 names start with ‘Du..’ Please check if this is the right name…even Dhuryodhan’s sister name is ‘Duschala’.
but ‘pramati’ is good name….no objections to that anyways.
పెదరాయుడుగారు,
దుర్యోధనుడి సోదరుల్లో చాలా మందికి “ద”తో మొదలవ్వని పేర్లు ఉన్నాయండి. ఉదాహరణకి విందానుదిందులు అంటారు. విందుడు, అనువిందుడు ఇద్దరూ దుర్యోధనుడి సోదరులే. ఇంకా వికర్ణుడి ప్రస్తావన కూడా “ద్రౌపదీ వస్త్రాపహరణం” ఘట్టంలో ఉంది. అతను కూడా దుర్యోధనుడి తమ్ముడే. నేను వికీలో కౌరవ అని వెతికితే ఈ పేరు వచ్చింది. 93వ తమ్ముడు ప్రమతి కాకపోవచ్చు కాని, కౌరవులందరి పేర్లు “దు”తోనే మొదలవ్వాలని లేదు. అలా కాకపోతే, వాళ్ళందరూ విలన్లు అని చెప్పడానికి అలాంటి పేర్లు పుస్తకాల్లో ఉండచ్చు. దుర్యోధనుడిని సుయోధనుడు అని కూడా అంటారు కదా మరి! ఏమంటారు?
పేరులోనేముంది బ్లాగులో ఉంది అంతా అనుకోకుండా పేరులో ‘నేమ్’ ఉంది అనుకొని ఓపిగ్గా పేర్లు గాలిస్తున్నందుకు అభినందనలు. “తెలుగులో:-)” అన్న పేరు కూడా బాగానే ఉన్నట్లుంది.
@ పెదరాయ్డు గారు
దుర్యోధనుడి తమ్ముళ్ళందరి పేర్లు దకారంతో ప్రారంభమవుతాయన్నది చాలామంది అపోహ. నిజంకాదు. ద్రౌపదీ వస్త్రాపహరణం సందర్బంలో దుర్యోధనుడితో విభేదించిన ఒకే ఒక తమ్ముడి పేరు ‘వికర్ణుడు’ (ఎన్నోవాడో నాకు తెలియదు).
బాగుంది. హాపీ బ్లాగింగ్!
@పూర్ణిమగారు, చంద్రమోహన్ గారు
కృతఙ్ఞతలు
వెల్ కమ్! ఓ రెండునెల్ల నించే నేను బ్లాగింగ్ చేస్తున్నా. కొంచెం నీరసించి బోర్ కొట్టేసే సమయానికి మీరు కొత్తగా వచ్చి కామెంటేశారు చూడండి, ఆనందంగా ఉంది.
“పేరులో ‘నేమ్’ ఉంది” – మంచి వ్యాఖ్యాతలు కూడా దొరికారండి – ఇంకేమి, హాపీ బ్లాగింగ్.
తెలుగులో:-)” అన్న పేరు కూడా బాగానే ఉంది. ప్రమతి కూడా బావుంది. ఫస్ట్ ది జనరిక్ గా ఉంది; పైగా ఆల్రెడీ వెబ్ సైట్ ఉంది ఆ పేరుతో . జనరల్ గా ఇష్టపడే విషయాలు, వ్యతిరేకించే విషయాలు ఏవో మీకు తెలుసు కాబట్టి, దాన్ని ప్రతిధ్వనించే పేరు పెట్టుకోండి – అది ప్రమతి అయితే చాలా బావుంది.
కాకపోతే దాని అర్ధం తెలీదండీ! ఓ హైదరాబాదు బేస్డ్ సాఫ్టవేర్ కంపెనీ అని మాత్రం తెలుసు